టీటీడీకు 15 ఈవీ బస్సులు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 బస్సులు ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నాయి.
EV buses


తెలంగాణ , 13 సెప్టెంబర్ (హి.స.)రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 బస్సులు ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నాయి. ఈ ఏడాది జూన్లో శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ టీటీడీకు రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులు, వాటికి అవసరమైన 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తుందని ప్రకటించారు. ఈ బస్సులను శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తుల సౌకర్యార్థం ఈనెల 16న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande