
ఢిల్లీ , 13 సెప్టెంబర్ (హి.స.)
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెండ్రోజులుగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో సింగరేణికి సంబంధించిన నాలుగు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో రోజుకు సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ప్రస్తుతం నిల్వ ఉన్న బొగ్గును రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో రోడ్లన్నీ బురద మయమై ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. భారీ యంత్రాలు సైతం కదల్లేని పరిస్థితి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్