
తెలంగాణ , 13 సెప్టెంబర్ (హి.స.)ఖైరతాబాద్లో మహాగణపతి పూజలందుకోవడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు 70 అడుగుల ఎత్తులో కొలువుదీరిన మహాగణపతి ఈ సంవత్సరం పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం విగ్రహ ప్రధాన శిల్పి రాజేంద్రన్ భక్తుల కోలాహలం మధ్య వినాయకుడి విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు. ఏటా ఉత్సవాలకు నాలుగైదు రోజులు ముందుగానే విగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఏటా చవితికి రెండ్రోజుల ముందు స్వామివారి కంటికి తుది మెరుగులు దిద్దడం ఆనవాయితీగా వస్తోంది. జూన్ 25న తొలి పూజలు చేయగా ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. విగ్రహం పూర్తిచేసేందుకు ఏటా దాదాపు మూడు నెలల వ్యవధి తీసుకుంటారు. ఈ ఏడాది రెండున్నర నెలల్లోనే విగ్రహాన్ని సిద్ధం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్