ఎస్పీ జానకి షర్మిలపై ఆరోపణలు.. ఖండించిన పోలీస్ సంక్షేమ సంఘం
నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిలపై వస్తున్న ఆరోపణలను నిర్మల్ జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం ఖండించింది. కొంతమంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఎస్పీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిర్మల్ పోలీసులు ముసుగులో స్వార్థపూరిత శక్తులు చేస్తున్న
SP


నిర్మల్, 13 సెప్టెంబర్ (హి.స.)

నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిలపై వస్తున్న ఆరోపణలను నిర్మల్ జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం ఖండించింది. కొంతమంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఎస్పీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిర్మల్ పోలీసులు ముసుగులో స్వార్థపూరిత శక్తులు చేస్తున్న నిరాధార ఆరోపణలను తప్పుబట్టింది.

ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిలకు పూర్తి మద్దతు తెలుపుతూ జిల్లా పోలీస్ సంక్షేమ శాఖపరమైన బదిలీలు, అటాచ్ మెంట్లు, ఇతర పరిపాలన చర్యలను కూడా వ్యక్తిగత నిర్ణయాలుగా చూయిస్తూ ఎస్పీపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు.

కొద్ది మంది వ్యక్తిగత అభిప్రాయాలను, అసంతృప్తులను మొత్తం పోలీస్ శాఖకు వ్యతిరేకంగా చిత్రీకరించడాన్ని నిర్మల్ జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. సిబ్బంది ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కో ఆపరేటివ్ రుణాలకు చర్యలు తీసుకుందన్నారు. ప్రజలు, సిబ్బంది సమస్యలను నేరుగా ఎస్పీకి చెప్పుకునేలా అవకాశం కల్పిస్తూ ప్రతి రోజు నిర్మల్ లో గ్రీవెన్స్ డే తీసుకువచ్చారని,ఐఐఐటీ బాసర విద్యార్థుల భద్రత, వారి సమస్యల విషయంలో ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande