
తెలంగాణ , 13 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్తోపాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్