గవర్నర్ పూసపాటి అశోక్ ను కలిసిన టీడీపీ నేత చిన్న శ్రీను
విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేత చిన్న శ్రీను, ఆయన కుమార్తె శిరిసహస్ర గోవాలో ఆ రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
గవర్నర్ పూసపాటి అశోక్ ను కలిసిన టీడీపీ నేత చిన్న శ్రీను


అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.) విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేత చిన్న శ్రీను, ఆయన కుమార్తె శిరిసహస్ర గోవాలో ఆ రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారికి గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గోవాలోని గవర్నర్ బంగ్లాలో చిన్న శ్రీను కుటుంబానికి అశోక్ గజపతిరాజు, టీడీపీ ఎమ్మెల్యే అదితివిజయలక్ష్మి ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు.

ఈ భేటీ అనంతరం చిన్న శ్రీను మాట్లాడుతూ.. పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఆదేశాలతో పాటు అశోక్ గజపతిరాజు సూచనలను తూచా తప్పకుండా పాటిస్తానని తెలిపారు. అశోక్ గజపతి రాజు ఆశీస్సులు, మార్గదర్శకత్వం కోసమే ఈ సమావేశం జరిగిందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీను ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande