దొంగతనానికి పాల్పడిన బీటెక్ యువకుడు అరెస్ట్
బీటెక్ పూర్తి చేసిన 22 ఏళ్ల యువకుడు దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఈ నెల 5న బెంగళూరు వెటర్నరీ కాలనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న దినేష్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది.
దొంగతనానికి పాల్పడిన బీటెక్ యువకుడు అరెస్ట్

అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)

బీటెక్ పూర్తి చేసిన 22 ఏళ్ల యువకుడు దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఈ నెల 5న బెంగళూరు వెటర్నరీ కాలనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న దినేష్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది.

తన చిన్నారికి చికిత్స కోసం సెప్టెంబర్ 4న కుటుంబంతో కలిసి చెన్నై వెళ్లిన దినేష్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన మరీదు వినోద్ కుమార్.. తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించాడు.

పోలీసులకు, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు చొక్కా విప్పి, బైక్ నంబర్ ప్లేట్ మార్చి మరీ చోరీకి పాల్పడ్డాడు. నిందితుడు వినోద్ కుమార్ను అరెస్టు చేసి చోరీకి గురైన బంగారాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నామని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande