పశ్చిమ బెంగాల్లో అనధికారిక మదర్సాలపై ఉక్కుపాదం: 252 మదర్సాలు మూసివేయాలని నోటీసులు
పశ్చిమ బెంగాల్లో అనధికారిక మదర్సాలపై ఉక్కుపాదం: 252 మదర్సాలు మూసివేయాలని నోటీసులు
పశ్చిమ బెంగాల్లో అనధికారిక మదర్సాలపై ఉక్కుపాదం: 252 మదర్సాలు మూసివేయాలని నోటీసులు


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు పొందకుండా, అవసరమైన మౌలిక సదుపాయాలు లేకుండా నిర్వహిస్తున్న మదర్సాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మైనారిటీ వ్యవహారాలు మరియు మదర్సా విద్యా శాఖ ఇటీవల నిర్వహించిన విస్తృత సర్వే ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 252 మదర్సాలను తక్షణమే మూసివేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన మరో 100 మదర్సాలకు అధికారులు షోకాజ్ (కారణం చూపు) నోటీసులు జారీ చేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు కోల్‌కతాలోనూ జిల్లా యంత్రాంగం ద్వారా ఈ సమగ్ర సర్వేను చేపట్టారు. ఈ విచారణలో ఎలాంటి అధికారిక రిజిస్ట్రేషన్, గుర్తింపు లేదా బోర్డు అఫిలియేషన్ లేకుండా సుమారు 2,396 మదర్సాలు నడుస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో ఎక్కువ శాతం ప్రభుత్వ సాయం లేని 'ఖారిజీ మదర్సాలే' ఉన్నట్లు తేలింది. ఈ తనిఖీల్లో భాగంగా ఏ మదర్సాల్లో అయితే తరగతి గదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కరవయ్యాయో మరియు నిర్ధారిత సిలబస్‌ను పాటించడం లేదో గుర్తించి, అలాంటి 252 సంస్థలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ జిల్లాల జాబితాలో మాల్డా ముందువరుసలో ఉండగా, ఉత్తర దినాజ్‌పూర్ మరియు దక్షిణ 24 పరగణా జిల్లాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

షోకాజ్ నోటీసులు అందుకున్న మిగతా వంద మదర్సాలు తమ చట్టబద్ధతను, ప్రమాణాలను నిరూపించుకోవడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించారు. ఒకవేళ ఆయా సంస్థల నుండి తృప్తికరమైన సమాధానం రాకపోతే వాటిపైనా మూసివేత వేటు పడనుంది. ఈ చర్యల ద్వారా మదర్సా విద్యార్థులు కూడా ఇతర పాఠశాలల విద్యార్థుల మాదిరిగానే ఆధునిక, నాణ్యమైన ప్రధాన స్రవంతి విద్యను పొందేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు వెల్లడించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande