ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
ఢిల్లీలో నేటి మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది
Fire accident


న్యూఢిల్లీ, 13 సెప్టెంబర్ (హి.స.)

ఢిల్లీలో నేటి మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్వరూప్ నగర్లోని జూడో దుస్తులు, బాక్సింగ్ గ్లాజుల గోడౌన్లో మొదటి అంతస్థులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సమాచారం అందడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 15 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేశారు. అగ్నిప్రమాదం జరిగిన తరవాత పక్క భవనానికి సైతం నల్లగా పొగలు వ్యాపించడంతో అందులో ఉన్న ఆరుగురు వ్యక్తులు భయాందోళనలో కిందకు దూకేసినట్టు పోలీసులు చెబుతున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అగ్రి ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ ఏ కారణమా? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande