'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026' ఉమ్మడి తీర్మానానికి సభ్య దేశాలన్నీ ఆమోదం
18వ బ్రిక్స్ సదస్సు ఆదివారం నాడు విజయవంతంగా ముగిసింది. 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026' పేరుతో రూపొందించిన ఉమ్మడి తీర్మానానికి సభ్య దేశాలన్నీ పూర్తి ఆమోదం తెలిపాయి.
PM Modi


ఢిల్లీ , 14 సెప్టెంబర్ (హి.స.)18వ బ్రిక్స్ సదస్సు ఆదివారం నాడు విజయవంతంగా ముగిసింది. 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026' పేరుతో రూపొందించిన ఉమ్మడి తీర్మానానికి సభ్య దేశాలన్నీ పూర్తి ఆమోదం తెలిపాయి. సుమారు 15 దేశాల అగ్రనేతలతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సమావేశంలో పాల్గొన్నారు.

ఇంక, గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతను చాటాలని భారత ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ దేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకుంటూనే, బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో సమతూకం పాటిస్తూ భారత్ దౌత్యపరంగా తన ప్రత్యేక ముద్ర వేసింది.

పుతిన్, పెజెష్కియన్లతో కీలక చర్చలు

సదస్సు మొదటి రోజున ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2030 నాటికి భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. రక్షణ, ఇంధనం, ఎరువుల సరఫరా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. అనంతరం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్తో భేటీ అయిన మోదీ, పశ్చిమాసియా సంక్షోభాన్ని కేవలం చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. సముద్ర మార్గాల్లో రవాణా భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్తో సమావేశమై భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలు తేవాలని మోదీ కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande