
ఢిల్లీ , 14 సెప్టెంబర్ (హి.స.)తమిళనాడులోని కరూర్ జిల్లాలో సుమారు 3 వేల ఏళ్ల క్రితం నాటి 50 రాతి వలయాలు (ఈమ చిహ్నాలు) బయటపడ్డాయి. కృష్ణరాయపురం సమీపంలోని పూవంబాడి తనికట్టు కరుప్పన్నస్వామి ఆలయం వెనక ఉన్న బంజరు భూమిలో ఈ రాతి వలయాలను గుర్తించారు. ఇవి వృత్తాకారంలో అమర్చి ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని కరూర్ జిల్లా పురావస్తు అధికారి నందకుమార్, కృష్ణరాయపురం తహసీల్దార్ మోహన్ రాజ్ తో పాటు రెవెన్యూ అధికారులు సందర్శించారు.
తమిళనాడులో కనుగొన్న అత్యంత ప్రాచీన పట్టణ నాగరికత 'కీళాడి' నాగరికత. శివగంగ జిల్లాలోని మదురైకి ఆగ్నేయంగా 12 కిలోమీటర్ల దూరంలో వైగై నది ఒడ్డున ఉన్న కీలాడి అనే గ్రామంలో జరిపిన పురావస్తు తవ్వకాల ద్వారా ఈ సంస్కృతి వెలుగులోకి వచ్చింది. ఈ తవ్వకాల్లో లభించిన ఆధారాల ప్రకారం ఈ నాగరికత క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటిదని గుర్తించారు. అంటే సుమారు 2,600 సంవత్సరాల క్రితం నాటిదన్నమాట. అయితే ఇప్పుడు తేనీ జిల్లాలో 4వేల సంవత్సరాల క్రితం నాటి సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. దీంతో కీళాడి నాగరికత కన్నా ముందు నాటి ఆనవాళ్లు ఇవని భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్