
ఆసిఫాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.)
ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం జామాడ, బలాన్ పూర్ గ్రామాలను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నీ, పంచాయతీ భవనాలను ప్రారంభించారు. నియోజకవర్గంలోని నార్నూర్, గాదిగూడ మండలాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కలెక్టర్ రాజర్షి షాను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నార్నూర్, గాదిగూడ మండలం పరిధిలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి తనతో పాటు జిల్లా కలెక్టర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. అనంతరం భూ భారతిలో భాగంగా రైతులకు పట్టాలు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..