పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలి.. పాలకుర్తి ఎమ్మెల్యే
పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలి.. పాలకుర్తి ఎమ్మెల్యే
MLA


పాలకుర్తి, 15 సెప్టెంబర్ (హి.స.)

నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాయపర్తి మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలపై శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

తాగునీరు, విద్యుత్తు, రహదారులు, పారిశుధ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, పింఛన్లు, రేషన్, ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను సమీక్షించారు. పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande