
ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)నేడు టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం మన్యం జిల్లా సాలూరులో
జరిగింది. ఈ సమావేశంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం విజయం సాధించడమే లక్ష్యమని సంధ్యారాణి పేర్కొన్నారు, అలాగే కూటమి అభ్యర్థుల విజయం కోసం సమిష్టి కృషి అవసరమని నొక్కి చెప్పారు. విభేదాలను పక్కన పెట్టి కూటమి ఐక్యతను కాపాడాలని ఆమె అందరికీ పిలుపునిచ్చారు. పనితీరు, విధేయత ఆధారంగా స్థానిక ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేస్తామని, రిజర్వేషన్ల వివరాలు ఖరారైన తర్వాత తుది ఎంపిక జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు 2029 ఎన్నికలకు పునాదిగా నిలుస్తాయని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్