
ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర ప్రభుత్వం 20 శాఖలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్-1 సహా మొత్తం 892 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రస్తుతం 20 శాఖలకు సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యాయి. ఐదు శాఖలకు సంబంధించి పోస్టులకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. మరో పది శాఖలకు సంబంధించి పోస్టులకు ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల కానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్