తిరుమలలో ఆకట్టుకుంటున్న పుష్పాలు
తిరుమల కల్యాణ వేదిక సమీపంలో ఒకటిన్నర ఎకరాల సువిశాల ప్రాంగణంలో 18 రకాల అరుదైన పుష్పాలు ఏకంగా 72,000ల పూల సమాహారంతో నాలుగు యుగాల చరిత్రను టీటీడీ ఆవిష్కరించింది.
Flowers


ఆంధ్రప్రదేశ్,15 సెప్టెంబర్ (హి.స.)తిరుమల కల్యాణ వేదిక సమీపంలో ఒకటిన్నర ఎకరాల సువిశాల ప్రాంగణంలో 18 రకాల అరుదైన పుష్పాలు ఏకంగా 72,000ల పూల సమాహారంతో నాలుగు యుగాల చరిత్రను టీటీడీ ఆవిష్కరించింది. మొత్తం 14 విభిన్న ఆధ్యాత్మిక థీమ్స్తో రూపొందించిన ఈ ప్రదర్శనలో శ్రీ వేంకటేశ్వరుని కలియుగావతార సైకత శిల్పం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.దాదాపు ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల వైభవాన్ని కళ్లకు కట్టేలా సిద్ధం చేసిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande