
ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)విజయనగరం దారుణం చోటుచేసుకుంది. నెల్లిమర్ల మండలం కుదిపిలో ప్లాస్టిక్ సంచిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలు పూసపాటిరేగ మండలం నడిపల్లికి చెందిన శీల రమగా గుర్తించారు. అదే ఊరికి చెందిన బంగారుబాబు మహిళను చంపాక మూటగట్టి, పొదల్లో పడేశాడు. శీల రమను తానే చంపినట్లు లంకలపల్లి బంగారుబాబు ఒప్పుకున్నాడు. శీల రమ అదృశ్యమైందని నిన్న పోలీసులకు ఆమె భర్త ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్