
మహబూబ్నగర్, 15 సెప్టెంబర్ (హి.స.)
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు.
భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు అధికారులను ఆదేశించారు. మంగళవారం బూత్ పూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై సమీక్షించారు.
విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, ఫాగింగ్, రోడ్ల సమస్యలను కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఏడాదిలో ఆధునిక మున్సిపల్ కార్యాలయాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపాదిత భవన నమూనాను పరిశీలించారు. హైవే సర్వీస్ రోడ్లకు లైటింగ్, సైడ్ డ్రైన్ల మరమ్మతులు చేపట్టాలని ఎల్అండ్ ప్రతినిధులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు