
ఆసిఫాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకైన సెప్టెంబర్ 17 చరిత్రను పాలకులు తమ నీచ రాజకీయాల కోసం తొక్కిపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, ఇతర నాయకులతో కలిసి కెరమెరి మండలంలోని జోడేఘాట్ ను సందర్శించిన భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను చరిత్ర మర్చిపోలేదని, ప్రభుత్వాలు మాత్రం విస్మరిస్తున్నాయని అన్నారు. సెప్టెంబర్ 17ను విలీన, విద్రోహ, సమైక్యత, ప్రజాపాలన దినోత్సవం పేరుతో వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నిర్వహించే విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి జాతీయ జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పిస్తారని గుర్తు చేశారు. ప్రభుత్వ కూడా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించి, అమరులకు నివాళులు అర్పించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..