పాన్ఐఐటీ ఏపీ సమ్మిట్లో పాల్గొంటా......సీఎం చంద్రబాబు
అక్టోబరు 3న విజయవాడలో జరిగే పాన్ఐఐటీ ఏపీ సమ్మిట్లో పాల్గొంటానని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
AP CM


ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)అక్టోబరు 3న విజయవాడలో జరిగే పాన్ఐఐటీ ఏపీ సమ్మిట్లో పాల్గొంటానని ఏపీ సీఎం చంద్రబాబు

స్పష్టం చేశారు. ఈ సదస్సులో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, ఐఐటీ పూర్వవిద్యార్థులు, టెక్నాలజీ నిపుణులు పాల్గొనాలని కోరారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్టెక్, స్పేస్టెక్ హబ్గా ఏపీ మారుతోందన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు యువత ఆలోచనలు, నైపుణ్యాలే కీలకమని మరియు

క్లీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, తయారీ రంగాల హబ్గా ఏపీ మారుతోందని సీఎం చంద్రబాబు ఎక్స్ లో ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande