సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఘనత కెసిఆర్ దే.. జీవన్ రెడ్డి
సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు జీవన్ రెడ్డి
జీవన్ రెడ్డి


జగిత్యాల, 15 సెప్టెంబర్ (హి.స.)

50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, గిరిజన జనాభాకు అనుగుణంగా కేసీఆర్ ధైర్యంగా రిజర్వేషన్ను 10 శాతానికి పెంచారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు.

గిరిజనులకు రిజర్వేషన్ ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్తోతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గిరిజనుల రిజర్వేషన్ విషయంలో కెసిఆర్ కేంద్రానికి నివేదిక పంపి, ఆమోదం రాకపోయినా అమలు చేశారని పేర్కొన్నారు. రిజర్వేషన్ పెంపుతో ఏటా వైద్య రంగంలో 440 మంది గిరిజనులు డాక్టర్ సీట్లు పొందుతున్నారని జీవన్రెడ్డి తెలిపారు. . తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు గురుకులాలు ఏర్పాటు చేసి, సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. సెప్టెంబరు 17న కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి తండా, గూడెంలో కేసీఆర్కు క్షీరాభిషేకం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande