
హైదరాబాద్ , 17 సెప్టెంబర్ (హి.స.)బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా (కె) గ్రామస్థులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతాభావం తెలిపారు. గిరిజన, ఆదివాసీల గూడాలను పంచాయతీలుగా చేసి, 10శాతం రిజర్వేషన్ కల్పించిన కేసీఆర్ గిరిజన ఆత్మబంధువని కొనియాడారు. ఈ సందర్భంగా గురువారం ఎడ్లబండిపై కేసీఆర్ చిత్రపటం పెట్టి, భజనలు చేస్తూ ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్