ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణకు హాజరైన కేటీఆర్
మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు.
KTR


హైదరాబాద్ , 18 సెప్టెంబర్ (హి.స.)మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి సుమారు రూ.55 కోట్లను విదేశీ సంస్థలకు బదిలీ చేయడంపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీబీ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకొని నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఫార్ములా-ఈ రేసు కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ-2గా ఐఏఎస్ అర్వింద్ కుమార్, ఏ-3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, ఏ-4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో గత విచారణకు కేటీఆర్ గైర్హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande