గణేశ్ లడ్డూ కోసం నగదుకు కూపన్ల
లడ్డూ కోసం నగదుకు కూపన్ల విక్రయించి వాటిని డ్రా ద్వారా తీసి విజేతకు లడ్డూను అప్పగిస్తున్నారు
Ganesh laddu


తెలంగాణ , 17 సెప్టెంబర్ (హి.స.)గణపతి నవరాత్రి ఉత్సవాలలో గణేశ్ చేతిలో నైవేద్యంగా పెట్టే లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడు ప్రసాదం ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే గణపతి వద్ద లడ్డూను ప్రసాదంగా సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనానికి వెళ్లేటప్పుడు వేలం పాట నిర్వహించి అధిక నగదుకు పాడిన వారికి అప్పగించే వారు. దీంతో డబ్బున్న వారికే గణపతి లడ్డూ దక్కేది. కానీ గత కొన్నేళ్లుగా ట్రెండ్ మార్చారు. ఇప్పుడు లడ్డూ కోసం నగదుకు కూపన్ల విక్రయించి వాటిని డ్రా ద్వారా తీసి విజేతకు లడ్డూను అప్పగిస్తున్నారు. మిర్యాలగూడలోని గణేశ్ మార్కెట్ లో 51వ వార్షికోత్సవం సందర్భంగా 50 కిలోల లడ్డూను ఏర్పాటు చేస్తుండగా లక్కీ డ్రా కూపన్ కోసం రూ.500 గా నిర్ణయించారు. ఆ తర్వాత డ్రా తీసి విజేతకు 50 కిలోల లడ్డూ అందించనున్నారు. అయితే చాలా మంది అదృష్టంగా భావిస్తున్నారు. పోతే దేవుడికి రూ.500 విరాళం అనుకుంటాం వస్తే 50 కిలోల లడ్డూ అదృష్టం వరిస్తుందని పలువురు అనుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande