రోడ్డు ప్రమాదం.....పెళ్లి బృందం బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ
కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నారు.
Accident


ఆంధ్రప్రదేశ్ , 17 సెప్టెంబర్ (హి.స.)కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.

పెళ్లి బృందం బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నారు. తునిలో వివాహ వేడుక ముగించుకుని కాకినాడ జిల్లా ఉప్పాడకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులు బయటపడ్డారు. బస్సులో ఉన్న 40 మందికి గాయాలు కాగా, వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ఉప్పాడకు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని కేసు నమోదు చేశారు.ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande