కేసీఆర్ లంబాడీ గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.......సత్యవతి రాథోడ్
కేసీఆర్ లంబాడీ గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
Kcr


తెలంగాణ , 17 సెప్టెంబర్ (హి.స.)కేసీఆర్ లంబాడీ గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని పెద్దతండాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుతోపాటు పోడు భూములకు పట్టాలు, తండాలకు నిధులు, గిరిజన విద్యార్థుల కోసం గురుకులాల ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టందని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande