పోలీసు ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీలు విడుదల చేసిన టీఎస్ఎల్పీఆర్బీ
తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) పోలీసు ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష తేదీలను విడుదల చేసింది.
Telangana police


తెలంగాణ , 17 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) పోలీసు ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఎస్ఐ అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న రాత పరీక్ష నిర్వహించనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. హోంశాఖ పరిధిలోని పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీ కోసం గత నెల 29న నోటిఫికేషన్లు జారీ చేశారు.ఈ నోటిఫికేష‌న్ వ‌లన చాలా మంది అభ్య‌ర్థులు లాభ‌ప‌డ‌నున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande