
నిర్మల్, 17 సెప్టెంబర్ (హి.స.)
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారిక వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే పారదర్శక పాలనను అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు