
ఆంధ్రప్రదేశ్ , 17 సెప్టెంబర్ (హి.స.)వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో జగన్ మాట్లాడారు .. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 51 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 688 మండలాల్లో దాదాపు 628 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఇందులో 332 మండలాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని గణాంకాలతో సహా వివరించారు. ప్రస్తుత దుస్థితి కేవలం ప్రకృతి తెచ్చిన విపత్తు మాత్రమే కాదని, పాలకుల చేతగానితనం వల్ల ఏర్పడిన 'ఎల్లో నినో ఎఫెక్ట్' అంటూ ఎద్దేవా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్