నేడు కీలక సమీక్షలు చేయనున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో పలు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు.
AP CM


ఆంధ్రప్రదేశ్ , 18 సెప్టెంబర్ (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో పలు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఆయన అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఈ భేటీలో ఆమోదం తెలపనున్నారు. మధ్యాహ్నం సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహిస్తారు. అమరావతి అభివృద్ధిపై ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సాయంత్రం పర్యాటకశాఖపై సమీక్ష జరిపి, రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande