
విశాఖపట్నం, 18 సెప్టెంబర్ (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు. ఆర్కే బీచ్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఏయూ కాలేజీ గ్రౌండ్లో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తారు. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ నుంచి తిరిగి అమరావతికి పయనం అవుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్