అక్టోబర్ 3న అమరావతిలో పాన్-ఐఐటీ సదస్సు
పాన్-ఐఐటీ అల్యుమ్ని ఇండియా భాగస్వామ్యంతో వచ్చే నెల అక్టోబర్ 3న అమరావతిలో పాన్-ఐఐటీ సదస్సును నిర్వహించనున్నారు.
Pan IIT


అమరావతి , 18 సెప్టెంబర్ (హి.స.)పాన్-ఐఐటీ అల్యుమ్ని ఇండియా భాగస్వామ్యంతో వచ్చే నెల అక్టోబర్ 3న అమరావతిలో పాన్-ఐఐటీ సదస్సును నిర్వహించనున్నారు. 'స్వర్ణాంధ్ర విజన్ కోసం ఆవిష్కరణలకు ఊతం' ఇతివృత్తంగా జరిగే సమ్మిట్కు ఐఐటీల డైరెక్టర్లు, ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టులు, విధాన నిర్ణేతలు, వర్సిటీల వీసీలు, విద్యార్థులు, పరిశోధకులు కలిపి సుమారు 600 మంది హాజరుకానున్నారు. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో లీడర్షిప్ డిన్నర్తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

'క్యూ-శివ' పేరుతో రూపొందించిన ఐదు చిన్నస్థాయి క్వాంటమ్ కంప్యూటర్లను ఈ సదస్సులో ఆవిష్కరించనున్నారు.

ఏపీని ఆవిష్కరణల హబ్గా తీర్చిదిద్దేలా డీప్టెక్ డిక్లరేషన్, మెంటార్ నెట్వర్క్, వెంచర్ ఫండ్ సహా పలు కీలక ప్రకటనలు వెలువడనున్నాయి. విద్యార్థులు, పరిశోధకులకు అవకాశాలు పెంచేలా డీప్టెక్ ఫెలోషిప్, ఐఐటీ నిపుణులతో 100 మంది సభ్యుల గ్లోబల్ మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు కానుంది. స్టార్టప్లకు పెట్టుబడులు అందించేందుకు పాన్-ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్, పరిశోధన-ఆవిష్కరణలకు శాశ్వత వేదికగా పాన్-ఐఐటీ అమరావతి కౌన్సిల్ ఏర్పాటు కానున్నాయి. , రాష్ట్ర భవిష్యత్తు ప్రాధాన్య రంగాల చుట్టూ సమ్మిట్లో చర్చలు సాగనున్నాయి. గ్రీన్ హైడ్రోజన్, సార, పవన విద్యుత్, బ్యాటరీ టెక్నాలజీతో స్వచ్ఛ ఇంధన వ్యవస్థలు, క్వాంటమ్, ఏఐ, సెమీకండక్టర్లతో పాలన, పరిశ్రమలు, సేవల ఆధునీకరణపై చర్చించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande