ఉమెన్స్ ఏపీఎల్కు మద్దతుగా విజయవాడలో 'బైక్స్ అండ్ బ్యాట్స్' ర్యాలీ
మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడం, టోర్నీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా విజయవాడలో 'బైక్స్ అండ్ బ్యాట్స్' పేరిట భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు.
Bike rally


ఆంధ్రప్రదేశ్ , 18 సెప్టెంబర్ (హి.స.)మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడం, టోర్నీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా విజయవాడలో 'బైక్స్ అండ్ బ్యాట్స్' పేరిట భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. మహిళా క్రికెటర్లను క్రీడా మైదానంలోకి ఆహ్వానిస్తూ, వారిని ప్రోత్సహించేందుకు విమెన్ ఏపీఎల్ ట్రోఫీతో సహా ఈ ర్యాలీని నిర్వహించడం నగరవాసులను ఆకట్టుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు.నోవోటెల్ సమీపంలోని జెనెక్స్ షోరూమ్ వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ, మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వరకు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 మందికి పైగా మహిళా బైకర్లు ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande