
కనిగిరి: , 19 సెప్టెంబర్ (హి.స.)
మార్కాపురం జిల్లా కనిగిరిలోని అమరావతి మైదానంలో శనివారం ఉచిత కంటివైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జనని ఛారిటబుల్ ట్రస్ట్, శంకర్ ఐ హాస్పిటల్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. మందులతోపాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ శిబిరాన్ని కనిగిరి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వైద్యులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ