వినాయక మండపాల వద్ద బాంబ్ డిస్పోజల్ టీమ్ విస్తృత తనిఖీలు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ వినాయక మండపాల వద్ద బాంబ్ డిస్పోజల్ టీమ్ శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.
Bamboo disposal


కరీంనగర్, 19 సెప్టెంబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ వినాయక మండపాల వద్ద బాంబ్ డిస్పోజల్ టీమ్ శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. వినాయక నవరాత్రుల ఉత్సవాల నేపథ్యంలో స్థానిక గంగాధర పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో బాంబ్ డిస్పోజల్ టీమ్ కలిసి శనివారం మండలంలోని పలు వినాయక మండపాలను సందర్శించి భద్రతా పరంగా నిిశితంగా పరిశీలించారు.

మండపాల పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా రక్షక బట టీం వివరించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ వంశీకృష్ణ సూచించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడానికి కాను ప్రజలు, మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande