
హైదరాబాద్ , 19 సెప్టెంబర్ (హి.స.)సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ - సీఎంసీ అధికారులు నగరంలోని గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లి ఎన్టీఆర్ నగర్ లో నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటనలో అధికారులు చర్యలకు చేపట్టారు. ఈ మేరకు భవనాన్ని నేలమట్టం చేసేందుకు ఎన్టీఆర్ నగర్ కు బాహుబలి క్రేన్ ను తెప్పించి కూల్చివేతను చేపట్టారు. ఏ క్షణంలోనైనా బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉండటంతో భవనం చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించి కూల్చివేతను ప్రారంభించారు.
అనుమతులు లేకుండా ఈ భవనాన్ని అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తన భవనాన్ని కూల్చడం నిలిపివేయాలని భవన యజమాని లక్ష్మి, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్