కృష్ణా జలాలను వాడుకోవడంలో తెలంగాణ విఫలం.. హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రం కృష్ణా జలాలను వాడుకోవడంలో పూర్తిగా విఫలం అయిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Harish Rao


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రం కృష్ణా జలాలను వాడుకోవడంలో పూర్తిగా విఫలం అయిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది శ్రీశైలంలో ఇప్పటికే 84 టీఎంసీలు తీసుకున్నట్లు ఉత్తమ్ చెప్పారని కల్వకుర్తికి ఇప్పటి వరకు కేవలం 8 టీఎంసీలు ఎత్తిపి 84 టీఎంసీలు అని చెప్పారని మండిపడ్డారు.

కల్వకుర్తికి నీళ్లు ఎత్తిపోసే వెల్లూరు 5 మోటార్లకు గాను కేవలం 2 మోటార్లు నడుపుతున్నారని మరో వైపు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, వెలిగొండకు నీళ్లు తరలించుకుపోతోందన్నారు. ఈ మూడేళ్లలో ఏపీ 718 టీఎంసీలు వాడితే తెలంగాణ కేవలం 216 టీఎంసీలు వాడిందని ధ్వజమెత్తారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత అతి తక్కువ వినియోగం 2024-2025 లో జరిగిందని 2025-26లో కేవలం 25 శాతం నీళ్లు మాత్రమే వాడుకున్నదని ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande