కుట్టు మిషన్ల పథకాన్ని మహిళలు ఉపయోగించుకోవాలి.. కలెక్టర్
ప్రభుత్వం ఉచితంగా అందించే కుట్టుమిషన్లకు అర్హులైన బీసీ మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సూచించారు.
Collector


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

ప్రభుత్వం ఉచితంగా అందించే కుట్టుమిషన్లకు అర్హులైన బీసీ మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న కుట్టు మిషన్ల పధకానికి నిరుద్యోగ మహిళలు ముఖ్యంగా నిరాశ్రయులు, ఒంటరి మహిళలు, వితంతువులు, అనాథ మహిళలు అర్హులని తెలిపారు.

జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 15 నియోజకవర్గాలకు 15 వేల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఒక్కో మిషన్ విలువ రూ.12 వేలు ఉంటుందని, దీనిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు. 18 నుంచి 55 ఏళ్లలోపు వయసు కలిగిన మహిళలు ఈనెల 30లోగా 'టీజీఓబీఎంఎంఎస్' ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande