అనకాపల్లి చోడవరం ప్రభుత్వ కళాశాలలో జాబ్ మేళా
అనకాపల్లి చోడవరం ప్రభుత్వ కళాశాలలో జాబ్ మేళా
అనకాపల్లి చోడవరం ప్రభుత్వ కళాశాలలో జాబ్ మేళా


చోడవరం: , 19 సెప్టెంబర్ (హి.స.)

అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాను స్థానిక ఎమ్మెల్యే కె. ఎస్. ఎన్. ఎస్. రాజు ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ 2025లో నాలుగు సార్లు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 133 మంది ఉద్యోగాలు పొంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ నెలలో జరిపిన జాబ్ మేళాల ద్వారా 21 మంది కొలువులు పొందినట్లు చెప్పారు. ఈ మేళాకు 18 కంపెనీల ప్రతినిధులతోపాటు 195 మంది యువతీ యువకులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళా ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు యువతీయువకులు చెప్పారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande