పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితా పునఃసిద్ధీకరణ కు షెడ్యూల్ విడుదల
తెలంగాణ శాసన మండలిలోని పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితా పునఃసిద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైందని భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హే
Collector


ములుగు, 19 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ శాసన మండలిలోని పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితా పునఃసిద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైందని భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.

ఈ నెల 28వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు నవంబర్ ఒకటో తేదీ 2026 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 3 సంవత్సరాలు పూర్తయి ఉండాలని తెలిపారు. ఓటు అర్హత కలిగిన పట్టబద్రులు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి అధికారిక వెబ్సైట్ ceotelangana.nic.in ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని వారు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande