కామన్ డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలి.. సిద్దిపేట జిల్లా కలెక్టర్
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి శనివారం కొండపాక మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.
Collector

సిద్దిపేట, 19 సెప్టెంబర్ (హి.స.)

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి శనివారం కొండపాక మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.

గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన కలెక్టర్.. కామన్ డైట్ మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. స్టోర్ రూమ్ నుంచి వంట సరుకులను విద్యార్థుల 'మెస్ కమిటీ' సమక్షంలోనే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అటెండెన్స్, ఓపీ రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బంది సమయపాలనను పరిశీలించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

 rajesh pande