IIT రూర్కీ కాన్వకేషన్ లో అజిత్ దోవల్ వ్యాఖ్యలు: ప్రస్తుత యువత అత్యంత అదృష్టవంతమైన తరం
IIT రూర్కీ కాన్వకేషన్ లో అజిత్ దోవల్ వ్యాఖ్యలు: ప్రస్తుత యువత అత్యంత అదృష్టవంతమైన తరం
ajith


హరిద్వార్ / రూర్కీ: 19 సెప్టెంబర్ (హి.స.)

భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీ (IIT Roorkee) శనివారం నిర్వహించిన కాన్వకేషన్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. గత వెయ్యి సంవత్సరాల్లో అత్యంత అదృష్టవంతమైన తరం నేటి యువతేనని కొనియాడారు. సాంకేతికత మరియు అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు నేటి తరానికి సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతున్నాయని చెప్పారు.

తన ప్రసంగంలో అజిత్ దోవల్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక క్లిష్టమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు:

సిక్కిం సరిహద్దు మిషన్

20 ఏళ్ల వయసులో యంగ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు, సిక్కిం భారత్‌లో విలీనమవుతున్న సమయంలో సరిహద్దు భద్రత మరియు చైనా బలగాల కదలికలపై నిఘా పెట్టే బాధ్యతను ఆయనకు అప్పగించారు.ఓసారి సరిహద్దుల్లోకి వెళ్లిన ఎనిమిది మంది నిఘా సిబ్బంది 15 రోజులైనా తిరిగి రాలేదు. వారు బతికే ఉన్నారో లేదో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యానని, ఆ ఘటనతో తన ఉద్యోగం పోయిందని అనుకున్నానని తెలిపారు.ఆ తర్వాత చైనా దళాలు ఆ బృందాన్ని నిర్బంధించి, విచారించి తిరిగి పంపించాయని తెలిసింది. విచారణలో ప్రధాన కార్యాలయం ఇచ్చిన మ్యాప్‌లలోని తప్పుల వల్లే ఆ బృందం సరిహద్దు దాటిందని తేలడంతో తనపై ఎలాంటి తప్పిదం లేదని నిర్ధారణ అయిందని చెప్పారు.ఒక అనుభవజ్ఞుడైన టిబెటన్ షెర్పా తనకు చెప్పిన మాటలను దోవల్ గుర్తుచేశారు. మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్లాలి, అక్కడికి చేరుకునే మార్గం ఏంటి? అనే స్పష్టత ఉంటే జీవితంలో ఎలాంటి గమ్యాన్నైనా చేరుకోవచ్చు అని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.

ఈ రెండు రోజుల ఘటికోత్సవంలో మొత్తం 2,701 మంది విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి, ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే, ఐఐటీ రూర్కీ డైరెక్టర్ కేకే పంత్ పాల్గొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande