
అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.)
ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్ పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసింది విద్య శాఖ. పరిశ్రమలు, సంస్థల అవసరాలకు తగినట్లుగా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర సాంకేతిక విద్యామండలి అదనపు కోర్సులను పాఠ్య ప్రణాళికల్లో చేర్చింది. వాటిద్వారా భవిష్యత్తులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.
కచ్చితంగా ఎంపిక చేసుకోవాల్సిందే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, ఎంఈ, ఈఐఈ, ఏఐ అండ్ ఎంఎల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు మూడు వేలపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేరిన విద్యార్థులు ప్రతి సెమిస్టర్లో ఒక ఆడిట్ కోర్సును ఎంపిక చేసుకోవాలి. దానికి బోర్డు పరీక్షలు ఉండవు. కళాశాలలో అంతర్గత పరీక్షల ద్వారా అభ్యసన సామర్థ్యాలను లెక్కిస్తారు. దీనితోపాటు ఎలక్ట్రికల్ కోర్సులను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటికి ప్రత్యేకంగా పరీక్షలుంటాయి. ఆ మార్కులను విద్యార్థి ఉత్తీర్ణత శాతంలో పొందుపరుస్తారని అధ్యాపకులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ