
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
బస్తీ దవాఖానల లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం వారు లింగోజిగూడ డివిజన్లోని కామేశ్వర్ రావు కాలనీ లోగల బస్తీ దావకానను సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య కేంద్రాల్లో మౌలిక వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బోరు ఎండిపోవడం వల్ల ఏర్పడిన నీటి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి కొత్త బోరు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా బస్తీ దవాఖానల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం ఉంటుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు