
అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.)
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు, నకిలీ ధ్రువపత్రాల వినియోగం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తూ శాప్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది.
ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు వినిపించాయి.
తమ వద్ద నియామకాలకు సంబంధించిన అక్రమాలపై ఆధారాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతుండగా.. టీచర్లు మాత్రం తమ వద్ద ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెడల్స్ నిజమైనవేనని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ