హైదరాబాద్లో ఆటో డ్రైవర్ హత్య నగరంలోని
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ప్రాంతంలో చిన్న మొత్తంలో చిల్లర డబ్బుల విషయంలో మొదలైన వివాదం తీవ్ర హింసకు దారితీసి ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది.
Murder


హైదరాబాద్ , 21 సెప్టెంబర్ (హి.స.)రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని

వట్టేపల్లి ప్రాంతంలో చిన్న మొత్తంలో చిల్లర డబ్బుల విషయంలో మొదలైన వివాదం తీవ్ర హింసకు దారితీసి ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని స్థానిక నివేదికల ప్రకారం 42 ఏళ్ల మహ్మద్ ముకర్రంగా గుర్తించారు.

పోలీసుల సమాచారం ప్రకారం ఆటో చార్జీకి సంబంధించిన రూ.10 చిల్లర విషయంలో డ్రైవర్కు కొందరితో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి అదుపు తప్పి కొట్టుకోవడానికి దారితీసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే దాడికి సంబంధించిన పూర్తి కారణాలు, నిందితుల పాత్ర, ఘటనకు ముందు జరిగిన పరిణామాలు వంటి అంశాలను పోలీసులు ఇంకా పరిశీలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande