సైబర్ నేరాల ను అరికట్టేందుకు కేంద్రం కీలక హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. అనుమతి లేకుండా ఇతరుల గుర్తింపు పత్రాలు ఉపయోగించి సిమ్ కార్డు తీసుకోవడం, జారీ చేయడం, టెలికాం గుర్తింపులను దుర్వినియోగం చేయడం, ఐఎంఈఐ నంబర్లలో అక్రమంగా మార్పులు చేయడాన్ని తీవ్ర నేరాలుగా పరిగణిస్తామని టెలీకమ్య
Cyber crime


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)

కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. అనుమతి లేకుండా ఇతరుల గుర్తింపు పత్రాలు ఉపయోగించి సిమ్ కార్డు తీసుకోవడం, జారీ చేయడం, టెలికాం గుర్తింపులను దుర్వినియోగం చేయడం, ఐఎంఈఐ నంబర్లలో అక్రమంగా మార్పులు చేయడాన్ని తీవ్ర నేరాలుగా పరిగణిస్తామని టెలీకమ్యూనికేషన్ విభాగం DoT వెల్లడించింది.

ఇలాంటి నేరాలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande