
తాళ్లూరు, 21 సెప్టెంబర్ (హి.స.)
ప్రకాశం జిల్లా తాళ్లూరులో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా భారీ వినాయక విగ్రహానికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయగా.. ఓ భక్తుడు రూ.50 వేలకు దక్కించుకున్నాడు.
తాళ్లూరు శివారులోని పారువేట బజారులో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయగా.. తాళ్లూరుకు చెందిన కల్లేపల్లి శ్రీనివాసులు రూ.50 వేలకు దక్కించుకున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ