గురుజాడ అప్పారావు జయంతికి మంత్రి లోకేష్ ఘన నివాళి
మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు.
Nara Lokesh


అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.)

మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు.

స్వాతంత్య్రానికి పూర్వమే బాల్యవివాహాలను వ్యతిరేకిస్తూ, స్త్రీ విద్యను ప్రోత్సహించిన అభ్యుదయవాది గురజాడ అని కొనియాడారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ దేశభక్తితో పాటు మానవశక్తి ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పిన మహాకవి గురజాడ అని పేర్కొన్నారు.

గురజాడ జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగలా నిర్వహించడం సంతోషంగా ఉందని నారా లోకేశ్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande