డిసెంబర్ నుంచి హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు
హైదరాబాద్లో డిసెంబర్ 2026 నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది.
Harward university


హైదరాబాద్ , 21 సెప్టెంబర్ (హి.స.)హైదరాబాద్లో డిసెంబర్ 2026 నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంతర్జాతీయ విద్యాసంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశాల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. హైదరాబాద్లో ప్రపంచస్థాయి విద్యా సంస్థల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నగరానికి అంతర్జాతీయ విద్యా బ్రాండ్ విలువ పెరగడంతో పాటు, స్థానిక విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ మేనేజర్లకు కొత్త శిక్షణ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సాధారణ డిగ్రీ విద్యకు భిన్నమైనది. ఇప్పటికే వృత్తిపరమైన అనుభవం ఉన్న వ్యక్తులకు నాయకత్వం, వ్యూహాత్మక నిర్వహణ, సంస్థల మార్పు, వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఈ తరహా కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, బిజినెస్ స్కూళ్లతో భాగస్వామ్యాలను పెంచడం ద్వారా తెలంగాణలో ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ, పరిశోధనలకు కొత్త అవకాశాలు ఏర్పడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande